News5am, Breaking News Telugu News (24/04/2025): హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. మెట్రోలో యాప్‌ల ప్రకటనలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసును అడ్వకేట్ నాగూర్ బాబు దాఖలు చేశారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మెట్రో డైరెక్టర్లపై సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 ప్రకారం ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. యాప్ ప్రమోషన్‌కు ముడుపులు తీసుకున్నారా అనే కోణంలో ఈడీ విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. హైకోర్టు దీనిపై సీరియస్‌గా స్పందించి తదుపరి విచారణను వాయిదా వేసింది.
More News:
Breaking News Telugu:
తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్…
More Breaking Big News: External Sources
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు