News5am, Breaking Telugu News (14-05-2025): తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎప్‌సెట్) ఫలితాలు ఈ నెల 11వ తేదీన విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు తన నివాసంలో విడుదల చేస్తారని ఎప్‌సెట్ కన్వీనర్ దీన్ కుమార్ మరియు కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. జేఎన్టీయూలో శుక్రవారం జరిగిన ఎప్‌సెట్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, ఫలితాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలు ముగిసిన కేవలం ఆరు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయనున్నందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి సిబ్బందిని అభినందించారు. ఈసారి విద్యార్థుల మొబైల్ ఫోన్లకు ఫలితాలను పంపించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం ఫలితాలు విడుదల చేసిన వెంటనే మార్కులు మరియు ర్యాంకులను విద్యార్థులకు పంపనున్నారని చెప్పారు. అలాగే ఫలితాలను https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో కూడా ఉంచనున్నారు.
More News
Latest Telugu News Today : టెస్టులకు కోహ్లీ గుడ్‌బై..
More Breaking Telugu News: External Sources
మే 11న తెలంగాణ ఎస్‌ఎెట్ ఫలితాలు