News5am,Breaking Telugu New (09-05-2025): తిరుమలలో మరోసారి కలకలం రేగింది. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతినిత్యం తిరుమల కొండపై ఆలయానికి సమీపంగా తరుచూ విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదు. దీనిపై టీటీడీ ఆగమ పండితులు పలు మార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, తిరుమల కొండ గగనతలంలో విమానాలు తిరుగడం కంటిపాపలా మారుతోంది.
తిరుమలను నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేంద్ర విమానయాన శాఖకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా, అవి పట్టించుకోకపోవడం లేదు. గతంలోనూ శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు ఎగరడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇదే పరిస్థితి మళ్లీ మళ్లీ పునరావృతమవుతోంది. అంతేకాక, ఆలయంపై డ్రోన్లు ఎగరడం, వాటిని టీటీడీ విజిలెన్స్ స్వాధీనం చేసుకోవడం, కొన్నిసార్లు కేసులు నమోదు చేయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ రోజు ఉదయం ఏకంగా ఐదు విమానాలు ఆలయ పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లడం భక్తులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
More Breaking Telugu News
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
More Breaking Telugu New: External Sources
తీరుమల ఆలయంపై మళ్లీ విమానాల చక్కర్లు