News5am, Telugu Breaking News 4 (21-05-2025): మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకుంటున్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, మోహన్ లాల్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, పాటలు — అన్నీ కూడా ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమాతో తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్‌ను విడుదల చేశారు. మే 21న మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్ర పోషణ, రూపం అన్నీ అద్భుతంగా కనిపించాయి. గూస్‌బంప్స్ తెప్పించేలా ఈ వీడియో కట్ చేశారు. ఈ గ్లింప్స్‌ను బట్టి చూస్తే కిరాత పాత్రలో మోహన్ లాల్ అద్భుతమైన నటనతో అలరించటం ఖాయం. ఈ పాత్రలో ఆయన యాక్టింగ్, స్టైల్ ప్రేక్షకుల మన్ననలు పొందేలా ఉన్నాయి. దైవిక శక్తితో ముడిపడిన ‘కిరాత’ అనే పాత్రను మోహన్ లాల్ ఈ చిత్రంలో పోషించారు. ప్రస్తుతం మంచు విష్ణు మరియు కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, ఇప్పటికే అమెరికా టూర్‌ను పూర్తిచేశారు.
More Breaking Telugu News:
Breaking Telugu News 4:
హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్.. రౌద్రరసాన్ని ఆవిష్కరించేలా ‘అసుర హననం’
More Telugu Movie Buzz: External Sources
మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్..