News5am, Breaking Telugu News(28-04-2025): ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో, భారీ వర్షాలు, కొన్ని చోట్ల పిడుగుల వర్షం కురుస్తోంది. అయితే, రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
అలాగే, ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు. రేపు అనగా మంగళవారం రోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక, ఎల్లుండి కూడా పలు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు, నిన్న అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్ర, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
More Breaking Telugu News:
వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ…
రామ్ పోతినేని సినిమాలో రియల్ స్టార్..
More Breaking Telugu News:: External Sources:
Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన..! 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు..