లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ మాస్టర్ జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. మహిళ కొరియాా గ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే . ఆయనను రెండు వారాలుగా జైలులో ఉన్నారు. రెండు వారాలుగా జైలులో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నా న్యాయస్థానం నిరాకరించింది.
తాజాగా నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు ఈరోజు బెయిల్ లభించడంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావడంతో బెయిల్ రావడం కష్టమయిందని న్యాయవాదులు వెల్లడించారు. మొత్తం మీద చివరకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అక్టోబర్ 25న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారని సమాచారం.