తెలంగాణలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రవేశాల కోసం నిర్వహించిన CPIGET-2024 మొదటి దశలో ఇప్పటికే సీట్లు కేటాయించబడ్డాయి. నేటి (సెప్టెంబర్ 21) నుంచి రెండో రౌండ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రాసెస్ చేయండి.సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కూడా జరగనుంది.అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు, 4వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 5న వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చు. అక్టోబర్ 9న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 17లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రవేశ పరీక్ష – టీజీ సీపెగెట్(కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) 2024.
సెప్టెంబర్ 21 నుంచి 27: ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన.
అక్టోబర్ 1వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 4- వెబ్ ఆప్షన్లకు తుది గడువు.
అక్టోబర్ 5 – వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 09 – సీపీగెట్ రెండో విడత సీట్ల కేటాయింపు.
అక్టోబర్ 17 – సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ – https://cpget.tsche.ac.in/
తెలంగాణ CPGET – 2024 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష) ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు అందించబడతాయి. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయింది.