తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో దొంగ ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్‌తో ఇంటి ముందు తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. అతను దొంగిలించడానికి విలువైన వస్తువు కోసం ఆవరణలో వెతకగా, దోచుకోవడానికి విలువైన వస్తువులు కనిపించకపోవడంతో దొంగ నిరాశ చెందాడు. ముఖాన్ని పూర్తిగా కప్పుకుని ఉన్న వ్యక్తి కొన్ని వస్తువులను దొంగిలించడానికి ఇంట్లో వెతుకుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఏమీ దొరక్కపోవడంతో కెమెరా దగ్గరికి వెళ్లి ఇంట్లో ఏమీ కనిపించడం లేదని సైగ చేశాడు. ఇంట్లోకి ఎలాగోలా వెళ్లిన దొంగకు ఒక్క రూపాయి కూడా దొరక్కపోవడంతో ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుని దాని డబ్బులంటూ రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఎవరో వచ్చి వెళ్లారనే అనుమానం కలగగా వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడు దొంగ ఇంట్లో చొరబడడం గమనించారు. మాస్క్ వేసుకుని వచ్చిన దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడికి ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. దొంగ ఇంట్లోని సీసీ టీవీ కెమెరా వద్దకు వచ్చి ఒక్క రూపాయి కూడా దొరకలేదని సైగ చేశాడు. ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఓ నీళ్ల బాటిల్ తీసుకున్నాడు. వెనక్కి వచ్చి జేబులోంచి పర్సు తీసి అందులోంచి రూ. 20 తీసి ఆ నోటును టేబుల్‌పై ఉంచాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంఘిక ప్రసార మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది.