మైనర్లకు వెహికల్స్​ఇస్తే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని, వారు వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే హత్యా కేసులు నమోదవుతాయని డిస్ర్టిక్ట్​ లీగల్​అథారిటీ సెల్​సెక్రటరీ, సీనియర్​ సివిల్​జడ్జి రజని అన్నారు. గురువారం వనపర్తి మండలంలోని చందాపూర్ జడ్పీ హై స్కూల్​లో సంస్థ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

వాహన చట్టాలను అనుసరిస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. బాల్య వివాహాల చట్టం, పోక్సో యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్, బాల కార్మికుల చట్టం గురించి తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య, హెచ్ఎం శంకరయ్య, టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *