విజయవాడ వరదలకు అతలాకుతలం అయిన వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి మేర ప్రయత్నిస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజకీయ‌, సినీ ప్ర‌ముఖులు త‌మ‌ వంతు సాయం చేస్తూ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటున్నారు. అయితే, తాజాగా ఓ దిన‌స‌రి కూలీ కూడా ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళం ప్ర‌క‌టించ‌డం విశేషం. రోజువారీ కూలీ ప‌నులు చేసుకుంటూ జీవనం సాగించే గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం అనే వ్య‌క్తి రూ. 600 సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని అత‌డు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించాడు. “ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 విజయవాడ వరద బాధితులకు ఏపీ ముఖ్య‌మంత్రి సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. నాకు స్ఫూర్తి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారు. కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది” అని గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. సుబ్ర‌హ్మ‌ణ్యంను అభినందిస్తూ స్పెష‌ల్ ట్వీట్ చేశారు. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం గారు అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *