దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. ఈరోజు (బుధవారం) కరోల్‌బాగ్‌లోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో రెండంతస్తుల నివాస భవనంలో ఒక భాగం కుప్పకూలింది. దీంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో NTRF, SDRAP బృందాలు కూడా పాల్గొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏడుగురిని రెస్క్యూ టీం కాపాడింది. కాగా, ఇటీవల దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో భారీ వర్షాల కారణంగా పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.