తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రకాశ్‌రాజ్ అంటే నాకు ఇష్టం. నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు .నటుడిగా ఆయనను ఎంతగానో గౌరవిస్తానని తెలిపారు. ఆయనతో కలిసి పని చేయడం తనకెంతో ఇష్టమన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే తాను పోస్టు పెట్టానని స్పష్టం చేశారు. ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైందని పవన్ తెలిపారు.