ములుగు: అడవి ప్రాంతాలలో ఉండే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వాళ్ళకి వైద్యం అవసరం. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు ఉండవు. ఇందువల్ల వైద్యులు ఎవరు ముందుకు రావడం లేదు. కానీ, ఓ వైద్యాధికారి మాత్రం మంచి మనసుతో తన వృత్తి పట్ల గౌరవాని చూపించారు. గుట్టలు, వాగులు దాటుకుంటూ వైద్య సేవలు చేశారు.
ముగ్గురు గ్రామస్తుల సహాయంతో వైద్య సిబ్బందితో పాటు, నడుము లోతు ప్రమాదకరమైన వాగులను దాటుకుని ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో డాక్టర్ మధుకర్ చేసిన మంచి పనిని, ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. డాక్టర్ చేసిన సహాయానికి గిరిజనులు ఎంతగానో సంతోష పడుతున్నారు.