హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను హైడ్రోపోలిక్ వీడ్‌గా గుర్తించారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వీరిద్దరి లగేజీని తనిఖీ చేసిన సమయంలో అనుమానం వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 13 కెల్లాగ్స్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్‌ను గుర్తించారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *