పామును చూసి చాలా మంది భయపడి పారిపోతారు. నాగుపాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా?… వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అయితే ఓ యువకుడు నాగుపామును చూసి భయపడకపోగా, దానితో ఆటలు ఆడాడు. కోపంతో ఉన్న నాగుపాము అతన్ని కాటేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సత్యసాయి జిల్లా కదిరిలో నాగరాజు అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా నాగుపాము కనిపించింది. మద్యం మత్తులో ఉన్న నాగరాజ్ రోడ్డుపై నుంచి పొదల్లోకి వెళ్తున్న నాగుపామును పట్టుకున్నాడు. మద్యం మత్తులో నాగుపాముతో ఆటలు ఆడాడు. అక్కడున్న వారు ఎంత చెప్పిన వినలేదు ఆ యువకుడు. నాగుపాము తలపై చేయి వేస్తూ దాని కొట్టాడు అదే సమయంలో అది కాటు వేసింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని నాగరాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు తెలిపారు.
ఈ వీడియో చూసిన వారు చాల కామెంట్లు పెడుతున్నారు. ‘పాము అంతసేపు ఓపికగా ఉండడమే గ్రేట్’, ‘మద్యం ఎంతపని చేసింది’, ‘హీరో అవుదామనుకున్నాడు కానీ జీరో అయ్యాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.