తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ మధ్య, ఇరు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను సోమవారం నుంచి శుక్రవారం వరకు (2 నుంచి 6వ తేదీ వరకు) రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను రద్దు చేసింది. మరో 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అదేవిదంగా 49 రైళ్లను దారి మళ్లిస్తునట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. అక్కడ పూర్తిగా ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లను పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.
రైళ్ల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. కే.సముద్రం-ఇంటెకన్నె, తాడ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్య, రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. పలు రైళ్లు ముందుకెళ్లడానికి వీలు లేక వివిధ స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోయాయి.