చైనాలో తాజాగా అనుకోని ఒక ఘటన చోటుచేసుకుంది. ఫాలోవర్ల కోసం పది గంటలు పాటు రకరకాల ఫుడ్స్ తిని, చివరకు ఉదర సంబంధిత సమస్యలతో కన్నుమూసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పాన్ జియాటింగ్ (24) అనే యువతి ఒకప్పుడు రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసింది. అదనపు ఆదాయం కోసం, ఫాలోవర్ల కోసం రాకరాకల ఫుడ్స్ తినేది. ఈమె చేసే రీల్స్ కి ఎంతగానో ఫాలోయింగ్ పెరిగింది. చివరకు కంటెంట్ క్రియేషన్‌యే ఆమెకు ప్రధాన ఆదాయవనరుగా మారింది. ఆ యావలో పడి ఆమె తనేం చేస్తున్నదీ గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది.
లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆమె తన ఫాలోవర్లు సూచించిన ఆహారాన్ని తింటుంటేది. ఇలా చేయడం వల్ల ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఎక్కువగా తినడం వల్ల ఆమె కడుపులో బోలెడంత అరగని ఆహారం ఉందని, కడుపు దిగవ భాగం పూర్తిగా పాడైపోయిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.