GATE 2026 registration

GATE 2026 registration: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గేట్‌ 2026 దరఖాస్తుల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ముందుగా ఆగస్టు 25న ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇప్పుడు ఆగస్టు 28న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 9 వరకు అవకాశం ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక్కో టెస్ట్ పేపర్‌కు రూ.1000 చెల్లించాలి. ఇతర కేటగిరీలు మరియు విదేశీ విద్యార్థులు రూ.2000 చెల్లించాలి. గేట్‌ పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా జరుగుతాయి. అడ్మిట్ కార్డులు జనవరి 2, 2025న విడుదల అవుతాయి.

ఈ పరీక్ష మూడు గంటల పాటు 100 మార్కులకు, 65 ప్రశ్నలతో జరుగుతుంది. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక మార్కు ప్రశ్నకు తప్పు జవాబు ఇస్తే 1/3, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 మార్కులు కోత ఉంటుంది. ఫలితాలు మార్చి 19, 2026న విడుదల అవుతాయి. స్కోర్ కార్డులు మార్చి 27 నుంచి మే 31 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్‌ 2026లో గరిష్టంగా రెండు పేపర్లకు రాయవచ్చు. వచ్చిన స్కోరు పీజీ ప్రవేశాలకు మూడు సంవత్సరాలు, పీఎస్‌యూల్లో నియామకానికి రెండు సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. మరిన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Internal Links:

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 జనరలిస్ట్ ఆఫీసర్ జాబ్స్..

నీట్ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల..

External Links:

గేట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వాయిదా.. కొత్త షెడ్యూల్‌ చూశారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *