జిమెయిల్ అకౌంట్లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ యాక్టివ్‌గా ఉన్న లక్షలాది జీ మెయిల్ అకౌంట్‌లను తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇన్ యాక్టివ్ మెయిల్ ఐడీల కారణంగా సర్వర్‌పై భారం పడుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి గానూ సెప్టెంబర్ 20 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా అవసరం ఉన్న మెయిల్ ఐడీలను యూజర్లు యాక్టివ్ చేసుకోవాలని లేకపోతే డిలీట్ చేయనున్నట్లు ప్రకటించింది. యాక్టివ్ చేసుకునేందుకు గడువు విధించిన తేదీలోగా మెయిల్ లాగిన్ చేసి వచ్చిన మెయిల్స్‌ని చదవడం.. ఎవరికో ఒకరికి మెయిల్ చేసినా సరిపోతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా జీమెయిల్ డిలీట్ అవుతుంది అని పేర్కొంది. లేకపోతే జీమెయిల్ అకౌంట్‌తో లింక్ అయిన యూట్యూబ్‌లో వీడియోలు చూసినా సరిపోతుంది. లేకుంటే ఏదైనా ఫొటోను మరొకరికి సెండ్ చేసిన మెయిల్ యాక్టివ్‌లోకి వస్తుంది.
అయితే చాలా మంది ఏదో అవసరం కోసం జీ మెయిల్ అకౌంట్‌లను తెరిచి ఆ తర్వాత మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ మరిచిపోతున్నారు. మరల అవసరమైన సందర్భాల్లో కొత్త అకౌంట్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. దాంతో ఆయా అకౌంట్స్ అన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంటాయి. ఈ ఇన్ యాక్టివ్ మెయిల్ ఐడీల కారణంగా సర్వర్‌పై భారం పడుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా మెయిల్ అవసరమైన సందర్భంలో యాక్టివ్ చేసుకోవడం మంచిది. లేకపోతె ముఖ్యమైన జిమెయిల్ అకౌంట్స్ తొలగింపుకు దారితీస్తుంది.