భారత్ క్రికెటర్ అయినా హార్దిక్ పాండ్య మరియు నటాషా వివాహ జీవితం ముగిసింది అని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ అనేక ప్రచారాలు జరిగాయి. ప్రస్తుతం ఆ పుకార్లే నిజం అవుతున్నాయి. తాజాగా సాంఘిక ప్రసార మాధ్యమంలో హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించాడు. కలిసి ఉన్న నాలుగు సంవత్సరాల తర్వాత, నటాషా మరియు నేను పరస్పరంగా విడిపోవాలని నిరయంచుకున్నామని, ఇద్దరం కలిసి ఉండడానికి చాల ప్రయత్నం చేసాము, ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. తమ మూడేళ్ల కొడుకు అయినా అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. మా కుమారుడు అయినా అగస్త్యను సంతోషంగా ఉంచడానికి మేము ఏమైనా చేస్తాం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు కావాలని తెలిపారు.

ఇదిలా ఉంటె ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న సమయం నుండే వీరి ఇద్దరి మీద అనేక పుకార్ల ప్రచారం జరిగింది. ఐపీల్ లో కూడా హార్దిక్ తన అభిమానుల చేత ట్రోల్ అయినా విషయం తెల్సిందే. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్య చివరి ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ వేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కానీ నటాషా దీని గురించి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. నటాషా తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇద్దరు విడిపోవడానికి అసలు కారణాలు తెలియరాలేదు. ఈ విషయం తెలిసాక హార్దిక్ అభిమానులు స్టే స్ట్రాంగ్ చాంప్ అని వారి ఆవేదాలను వ్యక్తం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *