మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కేసులో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టు నోటీసులపై కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల పిటిషన్‌దారు రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఫిర్యాదుదారు మృతి చెందితే పిటిషన్‌కు విచారణార్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినా పిటిషన్‌ను విచారించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో, ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.