హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నాయి.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ప్యాట్నీ, మారేడుపల్లి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.