ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొన్న విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ బోనాలు దృష్టిలో పెట్టుకొని ఆది, సోమవారాల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి అని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జులై 28న ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయబడతాయి. కల్లు , వైన్స్ షాపులు , రెస్టారెంట్లు , హోటల్స్ , క్లబ్స్ మరియు మద్యం విక్రయించే అన్ని సంస్థలు మూసి ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. పాత బస్తి పలు ప్రాంతాల మీదుగా అమ్మవారి ఊరేగింపు యాత్ర కొనసాగుతుంది. ఈ బోనాల ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. కావున ఆయా మార్గాలలో వాహనాలను కూడా మళ్లించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.