ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్న, చూసిన, హైడ్రా అని పేరు మారుమోగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) అధికారులు కూల్చివేస్తున్నారు. శనివారం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది.
దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెబుతున్నారు. ఈ మేరకు పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు. కాగా, హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.