News5am, Latest News Telugu (14-06-2025): దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో చెక్ చేసుకోవచ్చని NTA సూచించింది. ఈ పరీక్ష ఈ సంవత్సరం మే 4న జరిగింది. తెలంగాణలో మొత్తం 190 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు NEET పరీక్ష రాశారు. అందులో హైదరాబాద్ జిల్లాలోనే 62 కేంద్రాల్లో 26 వేల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 12 లక్షల మంది అర్హత సాధించడం గమనార్హం.
More Latest Telugu:
Today News:
జూన్ 12 నుంచి స్టూడెంట్ బస్పాస్ల జారీ..
గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
More Latest News Telugu: External Sources
నీట్ (యూజీ) ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..