టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని లావణ్య రాజ్ తరుణ్‌పై వరుసగా గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తా అన్నారు. రాజ్ తరుణ్ కోసం అవసరమైతే తాను నిరాహార దీక్ష చేస్తా అన్నారు. డ్రగ్స్ సాకుగా చూపి తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని లావణ్య ఆరోపించారు. ఇదే విషయమై సినిమా పెద్దలను త్వరలో కలుస్తా అన్నారు. అతడి కోసం నిరాహార దీక్ష చేస్తానని లావణ్య పేర్కొంది.
తనను (లావణ్య) రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకెళ్లారని తెలిపారు. రాజ్ తరుణ్, మాల్విపై ఫిర్యాదు చేసినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీరియస్ అయింది లావణ్య. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చా అన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని తనకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. కేసు నిలబడదని అడ్వొకేట్ రాజేష్ చెప్పారని.. ఆ బాధలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని లావణ్య అన్నారు.