తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాలు భారీగా తరలి వస్తుండటంతో ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్ ఇలా పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్ మీద, ఆ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపును చేపడుతున్నారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పావు గంట ప్రయాణానికి గంటల సమయం పడ్తుంది. రద్దీకి తగిన పోలీసుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మొజంజాహీ మార్కెట్ నుంచి ప్రారంభమై నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే, రేపు ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగబోతుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. గణేశ్ శోభాయాత్ర భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఇక, ఖైరతాబాద్‌ గణేషుడికి ఇవాళ( సోమవారం) పూజలు నిర్వహించి.. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర ప్రారంభం చేయనున్నారు మధ్యాహ్నాం ఒటి గంటలోపు నిమజ్జనం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం వరకు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *