నల్గొండ జిల్లా కలెక్టర్ కస్తూర్భా గాంధీ విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ, చెన్నై వంటి నగరాలకు విమానంలో తీసుకెళతానని చెప్పారు.
కనగల్ కస్తూర్భా హాస్టల్‌ను బుధవారం రాత్రి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వంటగది, హాస్టల్ గదులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలకు బాగా చదువుకోవాలని సూచించారు.