తెలంగాణ ప్రభుత్వం పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పే లక్ష్యంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు పోలీసు అధికారులను ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని నిబంధనలు రూపొందించినా కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అమాయక ప్రజలు, రైతులు, పేదలపై కర్కాస పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా నల్గొండలోని మునుగోడు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కోటి సింగ్ ఓ రైతుపై దాడి చేశాడు. ముత్యాలు అనే రైతును కొట్టాడు మునుగోడు మండలానికి చెందిన ఇద్దరు రైతుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో ఫిర్యాదు అందడంతో రైతు ముత్యాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే, పొలం పనులు ముగించుకుని వస్తానని రైతు ముత్యాలు ఏఎస్ఐ కోటి సింగ్ ని ప్రాధేయపడ్డాడు. దాంతో నాకే ఎదురు చెబుతావా అంటూ కోపంతో సదరు రైతుపై కుటుంబ సభ్యుల ముందే చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ రైతు ముత్యాలు కుటుంబ సభ్యులు ఏఎస్ఐ కోటి సింగ్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇక, ఏఎస్ఐ తీరుపై పైఅధికారులు తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *