NEET UG 2025 MCC Allots: దేశవ్యాప్తంగా వైద్య, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నీట్ (యూజీ) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఈ రౌండ్‌లో మొత్తం 26,608 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్లు తెలిపింది. ఫలితాలు mcc.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు తమ సీటు అలాట్‌మెంట్ స్టేటస్‌ను అందులో పొందుపరిచిన రిజల్ట్ పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది.
సీటు పొందిన అభ్యర్థులు గురువారం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం సంబంధిత కాలేజ్ లేదా సంస్థలో రిపోర్ట్ చేయాలని ఎంసీసీ తెలిపింది. రిపోర్టింగ్‌కు ముందు అలాట్‌మెంట్ లెటర్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఫోటోలు తీసుకురావాలని సూచించింది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించబోమని, కాబట్టి సమయానికి ముందే రిపోర్ట్ చేయాలని హెచ్చరించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Internal Links:
వైరల్ అవుతున్న జెస్సికా రాడ్‌క్లిఫ్ ఓర్కా వీడియో వెనుక నిజం
రాబోయే 72 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
External Links:
నీట్ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఫలితాలు విడుదల..