ఈ ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని నిఖిత పోర్వాల్‌ దక్కించుకున్నారు. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా విజేత‌కు కిరీటాన్ని అలంక‌రించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక తాజాగా జరిగిన ఈవెంట్‌లో రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్న రప్‌లుగా నిలిచారు.

ఈ 60వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన అందాల భామ‌లు పోటీప‌డ్డారు. తుదిపోరులో అద‌ర‌గొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విజేత‌గా నిలిచిన నిఖిత పోర్వాల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. “ఈ ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేను. నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి గర్వపడుతున్నాను. నా ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది” అని ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *