పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ,సాలార్ వంటి చిత్రాలలో నటించి గొప్ప నటుడు గా ఎంతగానో ప్రఖ్యతను పొందాడు. ఇటీవల విడుదల అయినా కల్కి2898 AD మూవీలో భైరవ పాత్రలో నటించాడు . ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా విషయం మన అందరికి తెలుసు . ప్రభాస్ కి పాన్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ క్రేజ్ ఉంది. ఇదిలా ఉండంగా ప్రభాస్ పెళ్లి విషయంపై తన ఫ్యాన్స్ ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. తాజాగా యాంకర్ సుమ ఒక ఈవెంట్లో ప్రభాస్ ని కలిసినప్పుడు పెళ్లి విషయం ఎప్పుడు అని అడిగానని తెలిపింది. దానికి బదులుగా సమాధానం ఇస్తూ ప్రభాస్ ఇలా అన్నాడట నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎంతగానో ఇష్టపడే అమ్మాయిల హార్ట్ బ్రేక్ అవ్వుది ఆలా కాకూడదనే పెళ్లి చేసుకోవటం లేదు అని అన్నారు అని యాంకర్ సుమ తెలిపింది. ఎదో ముఖ్యమయిన విషయం చెప్తది అనుకుంటే ప్రభాస్ వేసిన జోకును చెపింది అని ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో షికార్లు కొడుతోంది.