సోషల్ మీడియాలో రోజుకొక వింత వింత వీడియోలు ఎన్నో చూస్తూ ఉంటాం. తాజాగా పుణెలో ఓ ట్ర‌క్కు రివ‌ర్స్ గేర్‌లో దూసుకెళ్లిన ఘటన హ‌ద‌ప్స‌ర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అది కూడా డ్రైవ‌ర్‌లేకుండానే వెనక్కి వెళ్లింది. ఈ ట్రక్ పూణె మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ విభాగానికి చెందినగా గుర్తించారు. పూణె మున్సిపల్ కార్పొరేషన్ చెందిన ఆ ట్ర‌క్కు చాలా వేగంగా రివ‌ర్స్‌లో వెళ్లింది. రాత్రి పూట రోడ్డు ఖాళీగా ఉండ‌డంతో ఆ ట్ర‌క్కుకు ప్ర‌మాదం జ‌రగలేదు. రివ‌ర్స్‌లో దూసుకెళ్లిన ఆ ట్ర‌క్కు కొంత దూరం వెళ్లాక డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *