మహానగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఈరోజు (మంగళవారం) ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్.. ఇలా పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్షాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.