AP Rains

Rains in Telangana: బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు నగరాన్ని ముసురు కమ్మేసింది. చిరుజల్లులతో కూడిన వాతావరణం కారణంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారి గందరగోళం నెలకొంది. నాగోల్ రాక్‌టౌన్, హయత్‌నగర్, వనస్థలిపురం, మధురానగర్, ఉప్పల్, బండ్లగూడ, బహుదూర్‌పురా, సైదాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురవగా, షేక్‌పేటలో 8.6 సెం.మీ, టోలిచౌకిలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోల్కొండ, లంగర్‌హౌజ్, గచ్చిబౌలి, చందానగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడ వర్షంతో రహదారులు నీటమునిగాయి. హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.

వాతావరణ శాఖ ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్‌లో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశమున్నట్లు బేగంపేట వాతావరణశాఖ వెల్లడించింది. అదే సమయంలో బుధవారం రాత్రి కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మియాపూర్, సికింద్రాబాద్, బోయినిపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల సమయంలో కుత్బుల్లాపూర్ మహదేవపురంలో అత్యధికంగా 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Internal Links:

విద్యార్థుల నేతృత్వంలోని బంద్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు మూతపడ్డాయి.

మరో మూడు గంటలు భారీ వర్షాలు..

External Links:

కమ్మేసిన ముసురు.. చిరుజల్లులతో అవస్థలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *