బుడమేరుకు మరోమారు ముప్పు పొంచి ఉందని, పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు . ఈ వర్షాల కారణంగా బుడమేరుకు ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరు కు ఆకస్మిక వరదలు రావొచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ మేరకు సోమవారం ఉదయం బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్‌ సింగ్‌ నగర్‌, గుణదల, రామవరప్పాడు వంటి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, వెంటనే ఆ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *