ప్రముఖ క్షిపణుల శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) తుది శ్వాస విడిచారు .హైదరాబాద్‌లో ఉన్న ఆయన గురువారం కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్ నారాయణ్ అగర్వాల్ మృతిచెందారు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టర్‌గా రామ్ నారాయణ్ అగర్వాల్ వ్యవహరించారు. అలాగే అగర్వాల్‌ను అగ్నిమ్యాన్‌గా గుర్తింపు పొందారు. అగ్ని సిరీస్ క్షిపణులను ప్రారంభించడంలో అగర్వాల్ కీలక పాత్ర పోషించారు. అందుకే అగ్ని క్షిపణుల మొదటి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నరైన్ అగర్వాల్‌ని అగ్ని క్షిపణి పితామహుడిగా పిలుస్తున్నారు. రామ్ నరైన్ చేసిన సేవలకు గాను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. రామ్ నరైన్ అగర్వాల్ మృతి పట్ల డీఆర్‌డీఓ సీనియర్ మాజీ శాస్త్రవేత్తలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామ్ నరైన్ అగర్వాల్ మృతితో భారతదేశం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని డీఆర్‌డీఓ మాజీ చీఫ్, శాస్త్రవేత్త డాక్టర్ జీ సతీష్ రెడ్డి అన్నారు.
భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డా. రామ్ నారాయణ్ అగర్వాల్ అంతక్రియలను. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఆగస్టు 17న (శనివారం) అంత్యక్రియలు జరుగనున్నాయి