మహబూబాబాద్ జిల్లా మరిపెడ బస్టాండ్ సమీపంలో చేపల లోడుతో వెళ్తున్న బొలోరో వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలోని చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు చేపలను పట్టుకునేందుకు ఎగబడ్డారు. పట్టుకున్న చేపలను తీసుకెళ్లారు. అటుగా వెళ్లే వాహనదారులు సైతం చేపలు తీస్కొని వెళ్ళారు . కొందరు పట్టిన చేపలను సంచుల్లో వేసుకున్నారు. చేపలు పట్టేందుకు స్థానికులు పెద్దఎత్తున రోడ్డుపైకి రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బోలోరో వెహికల్ డైవర్ లబోదిబో మన్నాడు. బోలోరో వాహన యజమానికి విషయాన్ని వివరించాడు. సహాయం చేయాల్సింది పోయి దొరికింది ఛాన్స్ అంటూ స్థానికులు చేపలకోసం ఎగబడటంతో.. చేసేందీ ఏమీ లేక అక్కడి నుంచి డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినా స్థానికులు వినకుండా చేపలు పట్టుకునే పనిలో పడ్డారు. చేసేదేమి లేక పోలీసులు కూడా చూస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వేరే మార్గంలో వాహనాలను తరలించారు.