వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా, పారిశుధ్య కార్మికులు సెల్ఫీ కోసం దగ్గరకు వెళ్ళినందుకు అనుచితంగా ప్రవర్తించిన రోజా వీడియో ఒకటి వైరల్ గా మారింది. సెల్ఫీలు దిగాలని కోరిన పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావద్దని, దూరంగా ఉండాలని సైగ చేశారు. రోజా కుటుంబం ఇటీవల తిరుచ్చెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని సందర్శించింది. భర్త సెల్వమణితో కలిసి రోజా ఆలయంలో పూజలు చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న ఆమెతో సెల్ఫీలు దిగేందుకు కొందరు భక్తులు ఆసక్తి చూపారు. వారితో సెల్ఫీలు దిగేందుకు రోజా అంగీకరించింది.
ఈ క్రమంలో ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా పారిశుధ్య కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. పారిశుద్ధ్య విధుల్లో ఉన్న మహిళలు అక్కడికి చేరుకోవడం చూసి రోజా వారిని దూరంగా ఉండమని హెచ్చరించింది. పారిశుధ్య కార్మికురాలికి చేయి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లమని చెప్పడం వీడియోలో రికార్డైంది.