విధుల్లో ఉండ‌గా డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్ తీసుకున్న‌ట్లు త‌న‌కు ఎదురైన షాకింగ్‌ అనుభ‌వాన్ని తెలియ‌జేశారు.

ఈ మేర‌కు ఆయ‌న‌ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. ఈ సంఘ‌ట‌న‌తో డెలివ‌రీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో క‌లిసి జొమాటో మ‌రింత సాన్నిహిత్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని అన్నారు. దీనిపై మీరేమ‌నుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియ‌జేయం‌డంటూ నెటిజ‌న్లను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *