తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్లు ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు.
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి 24 పేజీల బుక్‌లెట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 4తో ఎగ్జామ్స్ ముగుస్తాయి.