తెలంగాణ రాష్ట్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సి శుక్రవారం ప్రకటించింది. డీఎస్సీ పరీక్షలు కూడా అదే సమయంలో జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం డిసెంబర్ 2022లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో 783 పోస్టులు ఉన్నాయి. వివిధ కారణాలతో ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు పెంచాలని, పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.