హైదరాబాద్: మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారించింది.మరోవైపు రాష్ట్రంలోని బీసీ కుల గణన చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బీసీ కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్ సభ్యులను నియమించింది. కుల గణన పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మూడు నెలల్లో కుల గణన పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.