వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వచ్చిన వీరు తిరుమలలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన తిరుమలకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దర్శనం అనంతరం ఫొటో షూట్, రీల్స్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి కంప్లైంట్ చేయగా తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పవిత్రమైన తిరుమాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బీఎన్ఎస్ 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.