మరికొన్ని రోజుల్లో టమోట, ఉల్లిధరలు సాధారణ స్థాయికి రానున్నాయి. ఢిల్లీ వాసులకు దక్షిణాదిలోని రెండు రాష్ట్రాల నుండి ఓ శుభవార్త అందింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల నుంచి టమోటాల సరఫరా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో టమాట ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో టమాటా రూ.75 ఉంది. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. టమాట సరఫరాలో తీవ్ర అంతరాయం రావడంతోనే టమాటా, ఉల్లి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే వీటి ధరలు స్థిరపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు మరికొన్ని పట్టణాల్లో టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయల ధరలు వీపరీతంగా పెరిగాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. భారీ వర్షాలు మరియు వేడి కారణంగా కూరగాయాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దీంతో ధరల పెరుగుదలకు దారితీసిందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.75కి చేరిందని, అయితే భారీ వర్షాల నేపథ్యంలో వీటి సరఫరాకు అంతరాయం కలగకపోతే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.