పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. తక్కువ జీతాలతో ఎలా బతకాలో తెలియక కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి, ముఖ్యంగా టమోటా ధరలు. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం కిలో టామాటా రూ.60-70కి చేరింది. కొన్ని మార్కెట్లలో అయితే ఏకంగా రూ.100కు కూడా అమ్ముతున్నారు. దిగుబడి లేకపోవడం వలన టమాటా రేటు పెరిగింది అని అధికారులు అంటున్నారు.