అమెరికా మాజి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం మన అందరికి తెలుసు. గత శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై 20 ఏళ్ల పెన్సిల్వేనియన్ వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) ఆదివారం తేల్చిచెపింది. అయితే తాజాగా ట్రంప్‌పై హ‌త్యాయ‌త్నం జరిగిన ఘ‌ట‌న‌ను ఉగాండా చిన్నారులు ఆ సన్నివేశాన్ని వీడియో రూపంలో చిత్రీకరించారు. ఆ వీడియో ప్ర‌స్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడ్తుంది. ఈ సన్నివేశాన్ని టిక్‌టాక‌ర్ బ్ల‌డ్ అగ్ అనే వ్యక్తి చిత్రీకరించారు. అయితే ఈ వీడియో కోసం చిన్నారులు. చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను వాడారని ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ సన్నివేశంలో ఒక పిల్లవాడు అమెరికా మాజి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గా మరికొందరు సహాయక సిబ్బందిగా నటించారు. పోడియంపై మాట్లాడుతున్న స‌మ‌యంలో బుల్లెట్ త‌గ‌ల‌గానే, చిన్నారితో పాటు అక్క‌డ ఉన్న సెక్యూర్టీ కింద దాక్కున్న‌ట్లు చిత్రీక‌రించారు. మీటింగ్ కి హాజరు అయినా జనం కూడా భయం తో కింద కుర్చునట్లు చిత్రీకరించారు. హ‌త్యాయ‌త్నం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ట్రంప్ ని సుర‌క్షితంగా తీసుకెళ్తున్న సీన్‌ను అద్భుతంగా చిత్రీకరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *