హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఇక నుంచి టీజీఎస్ఆర్టీసీగా మారనుంది. TGSRTC లోగో కూడా అప్డేట్ చేయబడుతుంది.“రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కార్పొరేషన్‌కి TGSRTC గా పేరు మార్చబడింది. మరోవైపు కార్పొరేషన్ కొత్త లోగోకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా ఖాతాలు కూడా అప్డేట్ చేయబడ్డాయి' అని టిఎస్ఆర్టిసి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ఏపీఎస్ఆర్టీసీని విభజించి టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశారు. దశాబ్దం తర్వాత మళ్లీ పేరు మారింది.