న్యూఢిల్లీ: దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ స్పందించారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరవీరుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ట్వీట్ చేశారు. అయితే, ఇంకెంతకాలం అమరుల భౌతికకాయాలు లెక్కిస్తూ ఉండాలని ఆమె ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని కేంద్రం చెబుతోంది. ఈ ముష్కరులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన సైనికులు ఎలా చనిపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం సైనికులకు బలవంతంగా అబద్ధాలు చెబుతోందన్నారు. దాడి జరిగిన ప్రతిసారీ కేంద్ర నాయకత్వం సంతాపాన్ని తెలియజేయడానికే పరిమితం కావాలా? ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి' అని ప్రియాంక ట్వీట్ చేశారు.