ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆగస్టు 20న నాంపల్లిలోని రెడ్రోస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్, ఐటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్, ఐటీ పరిశ్రమలకు చెందిన పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. కాబట్టి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. పాల్గొనే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు.